కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో తెరాస రైతులను మోసం చేస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ గొప్పగా చెప్పారని... ప్రధాని నిర్వాకం వల్ల రైతుల ఆదాయం తగ్గి... ఖర్చు పెరిగిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు భారీగా పెరిగి సాగు భారమైందని తెలిపారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభలో ఉత్తమ్, భట్టి ప్రసంగించారు.
'ఈ ఏడాది తామర తెగులు వల్ల మిర్చి రైతులు నష్టపోతే ఈ ప్రభుత్వాలు ఆదుకోలేదు. నాలుగేళ్లుగా రుణమాఫీ గురించి తెరాస ప్రభుత్వం మాట్లాడటం లేదు. దేశంలో పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధించేవారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తెరాస సర్కార్ ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ మాఫియాగా మారింది.' - ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు