తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్ట్.. సుబేదారి పీఎస్​కు తరలింపు - Telangana news

Ex IAS Aakunuri Murali Arrest: ఈ రోజు తెల్లవారుజామున మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు. రాత్రి నిద్రించిన ఇంటి తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించి మురళి, మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Ex IAS Aakunuri Murali Arrest
Ex IAS Aakunuri Murali Arrest

By

Published : Jan 31, 2023, 12:19 PM IST

Updated : Jan 31, 2023, 12:44 PM IST

మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్ట్.. సుబేదారి పీఎస్​కు తరలింపు

Ex IAS Aakunuri Murali Arrest: హనుమకొండ జిల్లాలోని అంబేడ్కర్ కాలనీలో తెల్లవారుజామున మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పంపిణీ చేయకుండా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, అర్హులకు త్వరితగతిన కేటాయించాలన్న డిమాండ్‌తో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కాలనీలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, ఇంటి తలుపులు పగులగొట్టిన పోలీసులు ఆకునూరి మురళితోపాటు మరోవ్యక్తిని అరెస్టు చేశారు.

ఇప్పటికే ఈ అంశంపై నిన్న అర్హులతో కలిసి డబుల్‌ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు ధర్నాకు వెళుతున్న మురళిని పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. తాజాగా రాత్రి మళ్లీ పేదలతో కలిసి సమావేశం నిర్వహించడంతో పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details