తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసలో కొనసాగాలా.. రాజీనామా చేయాలా... రేపు స్పష్టత ఇస్తా' - ఎమ్మెల్యే నరేందర్ తాజా వార్తలు

Errabelli Pradeep Rao: పార్టీను వీడుతానని సంకేతాలు ఇచ్చిన వరంగల్ తెరాస నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మరింత స్పష్టత ఇచ్చారు.రేపు మధ్యాహ్నం వరకు తెరాసలో కొనసాగేది.. రాజీనామా చేసే దానిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు
ఎర్రబెల్లి ప్రదీప్ రావు

By

Published : Aug 6, 2022, 4:01 PM IST

Errabelli Pradeep Rao: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలపై తెరాస రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. నరేందర్ మానసిక ఒత్తిడికి గురై ప్రజలను నాయకులను దూషించడం సరికాదని హితవు పలికారు. తన అండతోనే ఆయన ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. వెంటనే ఎమ్మెల్యే నరేందర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యుడి హోదాలో ఉండి అనవసరంగా వ్యక్తిగత దూషణలకు పోకూడదని ప్రదీప్ రావు సూచించారు.

ఎమ్మెల్యేగా నరేందర్ ఎన్నికైన తర్వాత తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రదీప్ రావు ఆరోపించారు. ఆయన చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయలని.. లేదంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రేపు మధ్యాహ్నం వరకు తెరాసలో కొనసాగేది.. రాజీనామా చేసే దానిపై స్పష్టత ఇస్తానని ప్రదీప్​ రావు చెప్పారు. తెరాస వల్ల తనకు, తన అనుచరులకు ఎలాంటి లబ్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు చేయడం బాధాకరమని ప్రదీప్​ రావు అన్నారు.

"నేను రేపటి నుంచి పార్టీలో కొనసాగను. మా సహకారంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు. కాదు అంటే రాజీనామా చేసి రావచ్చు. అవసరమైతే పార్టీ టిక్కెట్​పై పోటీ చేయవచ్చు. నేను ఇండింపెండెట్​గా నిలబడతాను. లేదు రూ.4000వేల కోట్లు తెచ్చి వరంగల్ ఈస్ట్​ను ఎక్కడి అభివృద్ధి చేశావో చూపించాలని డిమాండ్ చేస్తున్నాం." -ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తెరాస రాష్ట్ర నాయకులు

'రేపు తెరాసలో కొనసాగేది.. రాజీనామా చేసే దానిపై స్పష్టత ఇస్తా'

ఇవీ చదవండి:Telangana Inter Board : పెద్దలు చెబితే.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఓకే..

'సీఎం దొంగ అంటూ నినాదాలు!'.. కర్రలతో దాడి చేసిన ఎమ్మెల్యే!

ABOUT THE AUTHOR

...view details