లోక్సభ ఎన్నికల్లో వరంగల్ స్థానంలో తెరాసను అధిక మెజార్టీతో గెలిపించాలని తెరాస నేత, పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కోరారు. వరంగల్ లోక్సభ అభ్యర్థి పసునూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయన్నారు. రెండు లోక్సభ సీట్లతోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. 16 స్థానాల్లో విజయం సాధించి సీఎం దిల్లీని శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
'16 సీట్లతో కేసీఆర్ దిల్లీని శాసిస్తారు' - ఎర్రబెల్లి దయాకర్ రావు
లోక్సభ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావటం వల్ల నామపత్రాల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వరంగల్లో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోక్సభ ఎన్నికలు
Last Updated : Mar 25, 2019, 12:59 PM IST