తెలంగాణ

telangana

ETV Bharat / state

'దివ్యాంగులకు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' - Erraballi Dayakar rao tour in Warangal Urban District

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అంతార్జాతీయ దివ్యంగుల దినోత్సవంలో భాగంగా హన్మకొండలో మల్లికంబా మనోవికాస కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

erraballi-dayakar-rao-tour-in-warangal-urban-district
'దివ్యాంగులకు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

By

Published : Dec 10, 2019, 3:34 PM IST

తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే దివ్యాంగులకు సరైన గుర్తింపు లభించిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మల్లికంబా మనోవికాస కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మంత్రి దయాకర్ రావు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మానసిక దివ్యాంగులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.

ఆర్ధికంగా ఉన్నవారు ఇలాంటి మానసిక దివ్యాంగులను ఆదుకోవాలని సూచించారు. గతంలో 8 కేటగిరీలలో ఫించన్లు వచ్చేవారని...కానీ ఇప్పుడు 21 కేటగిరీల వారికి ఫించన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మల్లికంబా మనోవికస కేంద్రానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు.

'దివ్యాంగులకు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

ఇదీ చూడండి: బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details