Minister Errabelli Dayakara Rao Meeting Orugallu Maha Samakhya మహిళలు బాగుంటే.. రాష్ట్రం బాగుంటుంది Dwakra mahila sangam Warangal : పేదరిక నిర్మూలన సంస్థ(Poverty Alleviation Organization) ఓరుగల్లు మహా సమాఖ్య(Orugallu Maha Samakhya)కు చెందిన 58 మంది మహిళలతో మంత్రి ఎర్రబెల్లి దయాకరావు(Errabelli Dayakara Rao) హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లి.. లోకోస్(Locos Mobile App) అనే మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చే తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. వారి అనుభవాలను, సాధించిన ప్రగతిపై ఆరా తీశారు.
"పక్క రాష్ట్రాలకు కాదు.. పక్క దేశానికి వెళ్లి మా ఓరుగల్లు సమాఖ్య జెండా పాతి రావాలని ఆకాంక్ష. డ్వాక్రాలో వచ్చిన డబ్బులతోనే మా అమ్మాయిని చదివించాను. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయింది. చెన్నైలో మంచిగా ఉద్యోగం చేసుకుంటుంది. మా గ్రామంలో ఇళ్లు కట్టుకుంటున్నాను. ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో పర్యటించాము. అన్ని విషయాల పట్ల అక్కడకు వెళ్లి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము."- డ్వాక్రా మహిళలు
Errabelli Meets of Dwakra Groups warangal : మహిళా సాధికారతలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తుందని.. మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సాధించిన అభివృద్ధి దేశానికి చాటాలని కోరారు. నాలుగు లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాల్లో.. 45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని వివరించారు. తెలంగాణలో తప్ప మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున సంఘటితమైన మహిళలు లేరని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, గతంలో పాలించిన కాంగ్రెస్ సంక్షేమం ఊసెత్తకుండా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
అంతర్జాతీయ స్థాయికి 'పలాశ్' రుచులు
"ఈరోజు కేసీఆర్ వచ్చి తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో చేయని తీరుగా చేస్తున్నారు. ఎంత విజన్‌తో ఈ పనులను చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతకు ముందు డ్వాక్రా మహిళలకు రూ.6వేల కోట్లను మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తం రూ.25 వేల కోట్లను దాటిపోయింది. మీకు అడినంత ఇస్తున్నాం. మహిళలలే ఇప్పుడు కుటుంబాలను ఆదుకునే పరిస్థితి వచ్చింది. మీ వల్ల కుటుంబాలు అన్నీ బాగున్నాయి. మీరు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు.. అక్కడ బోరింగ్ల దగ్గరనే కొట్టుకుంటూ ఉంటారు. రోడ్లు పరిస్థితి ఎట్లా ఉంది.. ఇక్కడ ఎలా ఉంది. ఒక తొమ్మిదేళ్లలోనే ఇంత అభివృద్ధి.. అదే 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, దేశాన్ని
Orugallu Maha Samakhya :ఇప్పుడున్న మహిళలు సొంతంగా కుటుంబాన్ని, పిల్లల చదువులను, ఆఖరికి అత్తమామలను కూడా మంచిగా చూసుకోనే పరిస్థితి వచ్చిందంటే అది కేసీఆర్ చలవేనని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు, నల్లా పెట్టి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. వీటిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాఫీ కొట్టే స్థాయికి వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఇదే పనితీరును కనబరుస్తూ.. మహిళా సంఘాలు.. దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Ideal Village Mariyapuram : సర్పంచ్ కృషితో ఊరంతా పచ్చదనం.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న 'మరియాపురం'
Food Processing Industries in Telangana : ఊరూరా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం