ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధే లక్ష్యంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన సహృదయ అనాథ, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు నడుం బిగించింది. 'మన ఎంజీఎం, మన బాధ్యత' అనే నినాదంతో 30 రోజుల ప్రణాళికను చేపట్టి.. వచ్చిన నగదును ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. కుమ్మరికుంటలో కుండలను తయారు చేస్తూ ఒక్కరోజులో రూ. ఐదు వేలు సంపాదించారు. 30 రోజుల పాటు పని చేయగా వచ్చిన ఆదాయాన్ని ఆస్పత్రికి, రోగులకు అవసరమైన వైద్య పరికరాన్ని కొనుగోలు చేసి అందిస్తామని తెలిపారు.
'మన ఎంజీఎం, మన బాధ్యత' దిశగా యాకుబి
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి లక్ష్యంగా సహృదయ అనాథ, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు యాకుబి తన 30 రోజుల ప్రణాళిక ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు.
ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి యాకుబి విరాళం