ముగిసిన వరంగల్ నిట్ వజ్రోత్సవాలు - dimond jublee celebrations
మూడు రోజులుగా నిర్వహించిన నిట్ వజ్రోత్సవాలు నేటితో ముగిశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నిట్ వజ్రోత్సవాల ముగింపు సభలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే ఒక నది నీటిని దాని వ్యతిరేఖ దిశలో ప్రవహింప చేసే ప్రాజెక్టు కాళేశ్వరమని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణశైలి, పనిచేసే విధానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్‌లోని లింక్ 1, లింక్ 2 నిర్మాణదశ పూర్తై నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చి పూర్తిగా సహకరించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చూడండి : భారీ నష్టాల్లో ఆదిలాబాద్ ఆర్టీసీ