తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ టీఎంయూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఉద్యోగుల వేతన సవరణ, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. కార్మికుల కొరతతో పని భారం పెరిగిపోతోందని వాపోయారు.
హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల ధర్నా - హన్మకొండ
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా