కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాల్లో మూడవరోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు భద్రకాళీ అమ్మవారు కుల్ల(వరాహా) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలతో పాటు శుక్రవారం కలిసిరావడం వల్ల భక్తుల తాకిడి పెరిగిందని ఆలయాధికారులు పేర్కొన్నారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. భద్రకాళీ అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
శ్రీ భద్రకాళీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు - ammavaru
వరంగల్లోని శ్రీ భద్రకాళీ అమ్మవారి దర్శనానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి మొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు