తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో ఆందోళనకు దిగిన సీపీఎం నేతల అరెస్ట్ - tsrtc employees strike in all busstops in wోీోలుోత

రాష్ట్ర బంద్​లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

హన్మకొండలో ఆందోళనకు దిగిన సీపీఎం నేతల అరెస్ట్

By

Published : Oct 19, 2019, 2:11 PM IST

ఆర్టీసీ జేఏసీ కార్మికుల బంద్​ పిలుపు మేరకు వారికి మద్దతుగా వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి సర్కారుకు, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలన్నారు. రహదారిపై ఆందోళన చేస్తున్న సీపీఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

హన్మకొండలో ఆందోళనకు దిగిన సీపీఎం నేతల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details