వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది.
మూడో రోజు..
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది.
మూడో రోజు..
హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. జిల్లా వైద్యాధికారి నవీన్ ఆధ్వర్యంలో వైద్యులు టీకాలు వేశారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 14 ఆసుపత్రులలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మూడో రోజు 27 ఆసుపత్రులలో టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్ టీకాపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న వదంతులు నమ్మెద్దని తెలిపిన వైద్యాధికారి.. ఈ రోజు 3,139 మంది వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు