వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నగరంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయగా... టోకెన్లు తీసుకున్నవారికి టీకాలు వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండటం వల్ల వ్యాక్సినేషన్ సెంటర్లలో కరోనా నిబంధనలు పాటించడం కష్టంగా మారుతోంది.
Covid Vaccination: టీకా కేంద్రాల వద్ద కానిపించని భౌతిక దూరం - వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వ్యాక్సినేషన్
టీకా కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతోంది. జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటం వల్ల నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. ముందుగా టోకెన్లు తీసుకున్నవారికే వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేస్తున్నారు.
టీకా కేంద్రాల వద్ద కానరాని భౌతిక దూరం
అందరూ మాస్కులు పెట్టుకుంటున్నప్పటికీ... భౌతిక దూరం మాత్రం పాటించడం లేదు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకునేందుకు గుంపులుగుంపులుగా వస్తున్నారు. టీకా కేంద్రాల వద్ద అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'