తెలంగాణ

telangana

బాలికకు కరోనా.. అప్రమత్తమైన యంత్రాంగం

By

Published : Apr 22, 2020, 11:37 AM IST

వరంగల్​ అర్బన్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా ఓ పదేళ్ల బాలికకు కరోనా వైరస్ సోకగా.. రాత్రికి రాత్రి బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

corona-to-the-girl-in-warangal
అప్రమత్తమైన యంత్రాంగం

వరంగల్ అర్బన్ జిల్లాలో తాజాగా ఓ పదేళ్ల బాలికకు కరోనా వైరస్ సోకగా.. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రాత్రికి రాత్రి బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక కుటుంబసభ్యులు, ఇతర ప్రాథమిక సంబంధీకులుగా గుర్తించిన వారందరినీ క్వారంటైన్ చేశారు. పాజిటివ్ వచ్చిన బాలిక.. ఎవరెవరిని కలిసిందన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నగరంలో 15 కంటైన్మెంట్ జోన్లు ఉండగా... తాజాగా హన్మకొండలోని వడ్డేపల్లికి సమీపంలోనున్న పూరిగుట్ట ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​లోకి చేర్చారు. ఈ ప్రాంతమంతా... సోడియం హైపో క్లోరైట్ మందుతో పిచికారీ చేస్తున్నారు.

గ్రామంలో ఉన్న మిగతావారి ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో తెలుసుకునేందుకు... వైద్యబృందం ఇంటింటి సర్వే మొదలుపెట్టింది. జిల్లాలో ఇప్పటివరకు 10 మంది కోలుకుని... డిశ్చార్జి కాగా బాలికతో కలిపి 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం.. క్వారంటైన్​లో ఉన్న 46 మందికి నెగిటివ్ రిపోర్టులు రాగా.. మరో 43మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ABOUT THE AUTHOR

...view details