ఈనెల 29న తెరాస చేపట్టిన విజయ గర్జన భారీ సభ కోసం భూమి పరిశీలించేందుకు వెళ్లిన నాయకులకు(TRS vs Farmers in devannapet) చేదు అనుభవం ఎదురైంది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట(TRS vs Farmers in devannapet) లో తెరాస నాయకులు, రైతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానిక తెరాస కార్పొరేటర్ దివ్యరాణి భర్త రాజు నాయక్ ఓ వ్యక్తిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశాడు.
పొలాలు ఇచ్చేది లేదని
తెరాస పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్‌లో విజయ గర్జన సభ నిర్వహించేందుకు అధిష్ఠానం(TRS vs Farmers in devannapet) నిర్ణయించింది. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెరాస నాయకులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం అక్కడకు వెళ్లారు. అయితే దేవన్నపేట శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్న ఎమ్మెల్యేల వద్దకు స్థానిక రైతులు చేరుకున్నారు. సభ కోసం మా పొలాలను ఇచ్చేది(TRS vs Farmers in devannapet) లేదని రైతులు అందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు.