భారతీయ రైల్వే ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ధర్నా - సీఐటీయూ
రైల్వేను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ రైల్వే స్టేషన్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ధర్నా
ప్రైవేట్ రైలు మాకొద్దు అంటూ కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. రైల్వే ప్రైవేటీకరణ ఆలోచన ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు