జెరూసలెం నుంచి మట్టి, హాలెండ్ సాంకేతికతతో నిర్మాణం Chirstmas Celebrations 2023 : హనుమకొండ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కరుణాపురంలో నూతనంగా నిర్మించిన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం(Christhu Jyothi Church) భక్తులను ఎంతగానో అలరిస్తోంది. 9 ఎకరాల్లో అత్యంత సుందరంగా ఈ మందిరాన్ని నిర్మించారు. 2017 జూన్ 13న ఈ చర్చి పనులు ప్రారంభించగా, ఈ ఏడాది మే నెలలో పనులు పూర్తి అయ్యాయి.
మొదటిసారిగా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు(Chirstmas Celebrations 2023) ఘనంగా జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన నాటి నుంచి దేశ విదేశాల నుంచి అనేక మంది సందర్శకులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తున్నారు. చర్చిల్లో సహజంగా ఆదివారం ప్రార్థనలు జరగ్గా, ఇక్కడ మాత్రం శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరగడం విశేషం.
జెరూసలెం నుంచి మట్టి : 1992లో చిన్న గుడిసెను ప్రార్థన మందిరంగా నిర్మించి, అందులోనే ప్రార్థనలు చేసేవారు. ఆ తర్వాత అంచెలంచెలుగా మందిరాన్ని నిర్మిస్తూ, ఇప్పుడు అత్యంత విశాలమైన చర్చిగా నిర్మాణం చేశారు. హాలెండ్ సాంకేతికతతో జెరూసలెం(Jerusalem) నుంచి తెచ్చిన మట్టి, పరిశుద్ధమైన నీటితో, 12 రకాల వజ్రాలు, రాళ్లు, పిల్లర్లతో 12 గుమ్మాలను ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా చర్చిని నిర్మించారు. విదేశాల్లోని చర్చిలకు పోటీగా అమెరికా నుంచి తెచ్చిన అల్యూమినియం డూమ్‌ను అందంగా అమర్చి అందరినీ ఆకట్టుకునేలా నిర్మించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - ప్రభుత్వం తరఫున పేదలకు కానుకలు
35 నుంచి 40 వేల మంది కూర్చునేలా ప్రార్థన మందిరం : ఈ క్రమంలో డూమ్ నిర్మాణమే దాదాపు ఆరు నెలలు సాగింది. ఫ్రాన్స్ నుంచి తెచ్చిన సౌండ్ సిస్టంను చర్చిలో ఉపయోగిస్తున్నారు. చర్చిలో యేసుక్రీస్తు(Jesus Christ) జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా ప్రత్యేకంగా నిర్మాణం చేశారు. రెండో అంతస్తులో ఉన్న భవనంలో ఒకేసారి 35 నుంచి 40 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసే విధంగా సుందరంగా హాలును నిర్మించారు. వియత్నాం నుంచి తెచ్చిన అత్యద్భుతమైన మార్బుల్స్‌ను నిర్మాణంలో ఉపయోగించారు. పచ్చదనం పెంచి ఆహ్లాదం కలిగించేలా చర్చి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు.
Christhu Jyothi Church at Karunapuram in Warangal :రాష్ట్రంలోని మిగిలిన చర్చిలకు భిన్నంగా ఇక్కడ శనివారం రోజున ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో వర్ణించినట్లుగా చర్చి నిర్మాణం చేసినందుకు అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల నుంచి కూడా పురస్కారాలు అందుకున్నారు. క్రిస్మస్(Christmas) అంటే ఆడంబరంగా నిర్వహించే వేడుక కాదని నిరుపేదలకు సాయంగా నిలిచినప్పుడే క్రీస్తు ప్రేమకు పాత్రులవుతామని ఫాదర్ పాల్సన్ రాజ్ చెబుతున్నారు. అలాగే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విద్యుద్దీప అలంకరణను చేశారు. క్రీస్తు ఆరాధనలు, పాటలు, దేవుని వాక్యాల ఆలాపనలతో ప్రార్థన మందిరంలో నిత్యం కోలాహలంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - అందంగా ముస్తాబైన చర్చిలు
Christmas Celebrations : జోరందుకున్న క్రిస్మస్ సందడి.. ప్రత్యేక అలంకరణలో చర్చిలు