ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారి బరి నుంచి త్వరగా కోలుకోవాలని ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారిని వేడుకున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. సీఎం పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు మృత్యుంజయ హోమం నిర్వహించారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రి సత్యవతికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ కోలుకోవాలని సత్యవతి రాఠోడ్ పూజలు - గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వార్తలు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలతో పాటు మృత్యుంజయ హోమం నిర్వహించారు
సత్యవతి రాఠోడ్