తెలంగాణ

telangana

'ఏడాదిలో కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేస్తాం'

By

Published : Nov 15, 2020, 6:00 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేస్తోన్న కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌లు సందర్శించారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నాణ్యతలో తేడా లేకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

chief vip vinay bhaskar and boinpally vinod  kumar visits kaloji kalakshetram
'ఏడాదిలో కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేస్తాం'

కాళోజీ కళా క్షేత్ర నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాళోజీ కళా క్షేత్ర నిర్మాణ పనులను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోనే కాళోజీ కళాక్షేత్రం వైభవంగా విరాజిల్లనుందన్నారు.

కళాక్షేత్రం నిర్మాణానికి రూ.యాభై కోట్లు కేటాయించి నిర్మాణం చేపట్టామని... రవీంద్రభారతికి దీటుగా నిర్మిస్తామన్నారు. వేగవంతంగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదార్లను అదేశించారు. నిధుల కొరత లేకుండా... త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:టపాసుల కోసం వెళ్లి బాలుడు అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details