తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు రాష్ట్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 17వ డివిజన్ పరిధిలోని రెడ్డిపాలెం తెరాస అభ్యర్థి ఆకులపల్లి మనోహర్ తరఫున ప్రచారం నిర్వహించారు.
సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయి: చల్లా ధర్మారెడ్డి - తెలంగాణ వార్తలు
తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం చేశారు. ఓట్ల కోసమే విపక్షాలు ప్రజల వద్దకు వస్తాయని విమర్శించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని అన్నారు. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ చూసుకున్నారని కొనియాడారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. రాజకీయ లబ్ధికోసం విపక్ష నేతలు ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వస్తారని విమర్శించారు. తెరాసకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వేళ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:ఆరునెలల్లో కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు: ఎర్రబెల్లి