ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి గ్రామస్థులు ఒక అడుగు ముందుకేశారు. ప్రభుత్వ బడుల్లో చదవని విద్యార్థులకు గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి ధ్రువపత్రాలను ఇవ్వబోమని ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీల్లో తీసుకున్న ధ్రువపత్రాలకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ గోడప్రతులు అందించారు. ప్రైవేట్ పాఠశాలల వాహనాలను గ్రామంలోకి అనుమతించేదిలేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమం కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ రవీందర్, సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది.
వారికి మాత్రమే ధ్రువపత్రాలు జారీ... - గ్రామపంచాయతీ
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి జడ్పీటీసీ, సర్పంచ్ కొత్త విధానాన్ని చేపట్టారు. ప్రైవేట్ బడుల్లో చదివే పిల్లలకు గ్రామపంచాయతీ నుంచి ధ్రువపత్రాలు అందజేయబోమని తేల్చిచెప్పారు.
వారికి మాత్రమే ధ్రువపత్రాలు