వరంగల్ నగర ప్రజలు.. తెరాస నాయకులతో విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌కు తెరాస ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ కోసం భూమి కూడా ఇవ్వలేని తెరాస ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. వరంగల్ నగరంలో పర్యటించిన కిషన్ రెడ్డి.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని భాజపా అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
వరంగల్‌కు తెరాస సర్కార్ చేసిందేం లేదు : కిషన్ రెడ్డి
వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సాయాన్ని తెరాస సర్కార్ తమ ఖాతాలో వేసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లు నగర అభివృద్ధి బాధ్యతను అవినీతిపరులకు అప్పగించారని విమర్శించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థుల తరఫున పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు
అమృత, స్మార్ట్ సిటీ కింద జిల్లాకు రూ.550 కోట్ల నిధులతో రింగ్ రోడ్డు పనులు ప్రధాని మోదీ చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లు నగర పాలనను అవినీతి పరుల చేతిలో పెట్టారని విమర్శించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ కూడా చేయలేని అసమర్థ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. నగరానికి కేంద్రం చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుని భాజపాను బద్నాం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
- ఇదీ చదవండి :వైరస్ బారిన ఉద్యోగులు.. ఇప్పటికే పది మంది మృతి