వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ భారతదేశంలో 2017-18కి గాను ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా త్వరలో అవార్డును దక్కించుకుంది. తాజాగా ఆన్ రికార్డు ట్రైనీస్ విభాగంలో కేంద్ర రక్షణ శాఖ హోమ్ మినిస్టర్ ట్రోఫీకి ఎంపికైంది. శిక్షణార్థులకు కల్పిస్తున్న వసతులను కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ.. పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును అందించనున్నట్లు పీటీసీ ప్రిన్సిపల్ గంగారాం తెలిపారు. ట్రోఫీతో పాటు రూ. 2లక్షల నగదును అందించనున్నట్లు వెల్లడించారు.
ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా మామునూరు పీటీసీ.. - మూమూనూరు పీటీసీ జాతీయ అవార్డు
వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కేంద్రాన్ని.. ఉత్తమ శిక్షణ కేంద్రం అవార్డు వరించింది. దక్షిణ భారతదేశంలో శిక్షణార్థులకు కల్పిస్తున్న వసతులతో ఆన్ రికార్డు ట్రైనీస్ విభాగంలో కేంద్ర రక్షణ శాఖ హోమ్ మినిస్టర్ ట్రోఫీకి ఎంపికైంది. ట్రోఫీతో పాటు రూ. 2లక్షల నగదును అందుకోనుంది.
మామునూరు పీటీసీ
తెలంగాణలో ఆరు శిక్షణ కళాశాలు ఉంటే.. మామునూరు పీటీసీకి ఈ గౌరవం దక్కిందని గంగారాం అన్నారు. అవార్డు ప్రకటనతో పోలీసు శిక్షణ సిబ్బంది సంబురాలు జరుపుకున్నారు.
ఇదీ చదవండి:ఆర్టీసీ.. మెట్రో.. ఎంఎంటీఎస్.. సమన్వయం అడగొద్దు!