వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వెంకటాద్రినగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసులు కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పోలీసులు కోరారు. కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
కాజీపేటలో నిర్బంధ తనిఖీలు
కాజీపేట వెంకటాద్రినగర్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
కాజీపేటలో నిర్బంధ తనిఖీలు