తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ 19వ డివిజన్​కు ఉపఎన్నిక - trs

వరంగల్ 19వ డివిజన్​ ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. మార్చి 25న పోలింగ్​ జరగనుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నన్నపనేని రాజేందర్​ మేయర్​ పదవికి రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

19వ డివిజన్​కు ఉపఎన్నిక

By

Published : Mar 11, 2019, 5:57 AM IST

Updated : Mar 11, 2019, 10:48 AM IST

19వ డివిజన్​కు ఉపఎన్నిక
వరంగల్ మహా నగరపాలక సంస్థ 19వ డివిజన్​కు ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈనెల 15 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 25న పోలింగ్​ జరుగనుంది. 27న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లను బల్దియా అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్​ రవికిరణ్ అధికారులను ఆదేశించారు.

ఉపఎన్నిక ఎందుకంటే...

వరంగల్​ మహానగర పాలక సంస్థ 19వ డివిజన్​లో కార్పొరేటర్​గా గెలుపొందిన నన్నపనేని రాజేందర్ నగర మేయర్​గా ఎన్నికయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మేయర్​, కార్పొరేటర్​ పదవులకు రాజేందర్​ రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నామాపత్రాల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యాయి.

ఇవీ చూడండి:'లోక్​సభ'కు కమలం కసరత్తు

Last Updated : Mar 11, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details