తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి: ఎర్రబెల్లి - ambedkar jayanti celebrations news

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు కేటాయించిన మహనీయుడు డా. బీఆర్​ అంబేడ్కర్​ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో అంబేడ్కర్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ambedkar jayanti celebrations
అంబేడ్కర్​ జయంతి వేడుకలు

By

Published : Apr 14, 2021, 11:56 AM IST

కులవివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు కేటాయించిన మహనీయుడు డా. బీఆర్​ అంబేడ్కర్​ అని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహనికి మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్‌ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్ ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమానికి ఎన్నో ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ఆయన ఆశ‌య సాధ‌న‌కు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'వచ్చే ఏడాదికల్లా పాలమూరు మొత్తం సాగునీరు అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details