బోనాల పండుగను ఓరుగల్లు వాసులు ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం చివరి ఆదివారం కావడం వల్ల పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్టేషన్ రోడ్డులోని పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి బెల్లంతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించడానికి భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. చల్లగా చూడు తల్లి అంటూ బోనంను పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు డప్పుచప్పుళ్లతో బోనాన్ని తలపై పెట్టుకొని ఆలయానికి చేరుకున్నారు. తొట్టెలను కానుకలను అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
ఓరుగల్లులోని పోచమ్మకు శ్రావణ మాస బోనాలు - ప్రాంగణం
శ్రావణమాసం చివరి ఆదివారం సందర్భంగా ఓరుగల్లులోని స్టేషన్ రోడ్డు వద్ద ఉన్న పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తొట్టెలు, కానుకలను, బెల్లంతో కూడిన నైవేద్యాలతో బోనాలను అమ్మవారికి సమర్పించుకున్నారు.
ఓరుగల్లులోని పోచమ్మకు శ్రావణ మాస బోనాలు