Bodhakalu Disease in Saipet Villagers: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామాన్ని బోదకాలు వ్యాధి పట్టిపీడిస్తోందని. ఈ వ్యాధి వల్ల రోగులు మంచానికే పరిమితమవుతున్నారు. కుటుంబసభ్యులే వారి ఆలనాపాలనా చూడాల్సి వస్తోంది. చాలామంది వ్యాధిగ్రస్తులు నెలలో నాలుగైదు రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటారు. ప్రభుత్వం నుంచి సరైన వైద్యసాయం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు చూపించుకుంటూ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ధర్మసాగర్ మండలంలో 350 మంది దాకా బోదకాలు బాధితులున్నారు. ఇందులో కొంతమందికి మాత్రమే ఫించన్లు వస్తున్నాయి. మిగతావారికి రావట్లేదు. నెలకు మూడు వేల దాకా వైద్యానికే ఖర్చువతుండటంతో... వచ్చిన డబ్బులు సైతం సరిపోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేయడానికి ఆరోగ్యం సహకరించక.. వైద్య సదుపాయాలకు డబ్బులు సరిపోక.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తమ గోడు ఆలకించి, తగిన వైద్యసాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూలీనాలీ చేసుకోని బ్రతికే తమకు ఈ వ్యాధి వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎర్పడుతున్నాయని బాధితులందరికీ ఫించన్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.