తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఆందోళనలో ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్​ - mp arvindh

వరంగల్​ జిల్లా హన్మకొండలో భాజపా శ్రేణులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తతత చోటుచేసుకుంది. ఎంపీ అర్వింద్​పై దాడిని ఖండిస్తూ... కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి ధర్నా చేపట్టారు.

bjp protest at hanmakonda
భాజపా ఆందోళనలో ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్​

By

Published : Jul 13, 2020, 4:29 PM IST

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​పై దాడిని ఖండిస్తూ.. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద భాజపా శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దాడి హేయమంటూ రోడ్డుపై భైఠాయించి.. కార్యకర్తలు నినాదాలు చేశారు.

భాజపా జిల్లా అధ్యక్షులు రావు పద్మను పోలీసులు అదుపులోకి తీసుకోగా... భాజపా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రేమేందర్​ రెడ్డితో సహా పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు కూడా వెళ్లనీయకుండా నిర్బంధిస్తున్నారని... రావు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details