తెలంగాణ

telangana

ETV Bharat / state

బోర్డులు రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థ తీసుకొస్తాం : ఎంపీ అర్వింద్ - bjp MP Dharmapuri Arvind

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు సుదర్శన చక్రం లాంటివని భాజపా ఎంపీ అర్వింద్ అన్నారు. రైతులకు మేలు చేసేందుకే మోదీ ఈ చట్టాలను తీసుకువచ్చారని తెలిపారు.

bjp mp arvind about new agriculture acts 2020
బోర్డులు రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థ తీసుకొస్తాం

By

Published : Dec 20, 2020, 1:56 PM IST

రోజురోజుకు రైతుల పరిస్థితి దిగజారుతోందే తప్ప మెరుగుపడటం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతకు మేలు చేసేందుకే కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. వీటిపై అవగాహన లేకుండా.. విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో బోర్డుల వ్యవస్థను రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థను తీసుకువస్తామని స్పష్టం చేశారు.

బోర్డులు రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థ తీసుకొస్తాం

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలతో సీఎం కేసీఆర్​కు ఏం నష్టమని అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్.. తన ఫాంహౌస్​లో పండించిన పంటలను కార్పొరేట్లకు అమ్ముకోవచ్చుకానీ.. రైతులు మాత్రం అమ్ముకోకూడదా అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details