ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన భారత జట్టు మాజీ సారథి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ జన్మదిన వేడుకలను వరంగల్ నగరంలో ఘనంగా నిర్వహించారు. సిటీలోని క్రీడా మైదానంలో మహేంద్రుడి అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 2005లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న ధోని.. అప్పటినుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి అన్ని ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. రాజీవ్ ఖేల్రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్లతో పాటు మరెన్నో అవార్డులు ధోనిని వరించాయి.
వరంగల్లో ధోని జన్మదిన వేడుకలు - miister cool
ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్, సారథిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులు, గొప్ప ఫినిషనర్గా పేరు గడించిన మిస్టల్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు వేడుకలను వరంగల్లో ఘనంగా నిర్వహించారు.
ధోని జన్మదిన వేడుకలు