వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని విద్యుత్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. మహిళ సహకార డెయిరీ వెనకాల విద్యుత్ తీగలు సరి చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెట్టుకున్న తేనెటీగలు లేచి ఒక్కసారిగా లైన్ మెన్లు గాజుల సంపత్, నాగరాజు, అనిల్, శ్రీనివాస్, రాజు, శ్రీనులపై దాడి చేయడంతో వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పరుగెత్తారు.
విద్యుత్ సిబ్బందిపై తేనెటీగల దాడి - Bee attack
విద్యుత్ తీగలు సరి చేస్తున్న సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో చోటుచేసుకుంది.
విద్యుత్ సిబ్బందిపై తేనెటీగల దాడి
వీరిని ముల్కనూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం ఆరుగురు విద్యుత్ సిబ్బందికి స్వల్ప గాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:ఒకే చితిపై 8 మృతదేహాల దహనం.. కారణమిదే!