తెలంగాణ

telangana

ETV Bharat / state

బీడీఎస్​ యాజమాన్య కోటా ప్రవేశ ప్రకటన - kaloji

యాజమాన్య కోటా కింద బీడీఎస్ ప్రవేశానికి కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ కటాఫ్ స్కోర్ తగ్గిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం

By

Published : Sep 10, 2019, 9:16 AM IST

వరగంల్​లోని కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశానికి ప్రకటన విడుదల చేశారు. నీట్ కటాఫ్ స్కోర్ తగ్గిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కటాఫ్ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు హైదరాబాద్​లోని ఉస్మానియా యూనివర్సిటీలో సంబంధిత ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు 30 శాతం, దివ్యాంగులకు 35 శాతం కటాఫ్ స్కోరు తగ్గించిందన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 11న సాయంత్రం ఐదు గంటల వరకే యాజమాన్య కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంబంధిత పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు.

బీడీఎస్​ యాజమాన్య కోటా ప్రవేశ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details