వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. పెత్తర అమావాస్య రోజు తొలి బతుకమ్మ ఆడారు. ఈ సారి అధికమాసం వచ్చిన సందర్భంగా వేయి స్తంభాల ఆలయం ఆవరణలో ఆచారం ప్రకారం అమావాస్య రోజు ఆడపడుచులు బతుకమ్మ ఆడి పాడారు.
ఓరుగల్లులో వైభవంగా బతుకమ్మ వేడుకలు - ఓరుగల్లు జిల్లా వార్తలు
ఓరుగల్లులో మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వేయి స్తంభాల ఆలయం ఆవరణలో పెత్తర అమావాస్య సందర్భంగా ఈరోజు ఆడపడుచులు బతుకమ్మను ఆడి పాడారు.
bathukamma
తొలి రోజు బతుకమ్మ ఆడి పాడి మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆచారం ప్రకారం మళ్లీ వచ్చే నెల అక్టోబర్ 16 నుంచి 24 వరకు బతుకమ్మను ఆడనున్నారు. తొలి రోజు మహిళలు తక్కువ సంఖ్యలో వచ్చి మాస్కులు ధరించి బతుకమ్మను ఆడి పాడారు.
ఇదీ చదవండి:సెప్టెంబర్17 ను పురస్కరించుకుని జెండా ఆవిష్కరించిన నేతలు