Bandi Sanjay Bail Cancellation: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌ను హనుమకొండ న్యాయస్ధానం కొట్టివేసింది. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. హనుమకొండ నాలుగవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. తాజా తీర్పుతో బండి సంజయ్‌కు ఊరట లభించినట్లు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్‌కు ఈ నెల 6న బెయిల్ మంజూరైంది. అయితే బండి సంజయ్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 17న హనుమకొండ కోర్టులో కమలాపూర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
BANDI SANJAY: బండి సంజయ్‌కు రిలీఫ్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసిన కోర్టు - బండి సంజయ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
15:24 April 27
బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసిన హనుమకొండ జిల్లా కోర్టు
లీకేజీలో ప్రధాన నిందితునిగా ఉన్న సంజయ్.. విచారణకు సహకరించట్లేదని బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ ప్రత్యేక పీపీ సత్యనారాయణ వాదనలు వినిపించారు. బండి సంజయ్ బెయిల్ రద్దుకు సహేతుక కారణాలు లేవంటూ ఆయన తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హనుమకొండ న్యాయస్థానం ఆఖరి తీర్పును ఇచ్చింది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తూ.. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగింది:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితునిగా పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్‌లోని పాఠశాలలో హిందీ పేపర్ లీకేజీలో ముగ్గురు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి.. కరీంనగర్ బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నేరుగా హనుమకొండ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేశారు. బండిపై 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసును నమోదు చేసి.. ఏ1 గా చేర్చి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హైకోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్ రద్దును కోరుతూ.. పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో తీర్పు వచ్చింది.
ఇవీ చదవండి: