తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవాలయాల్లో భక్తుల సందడి... మొదలైన ఆర్జిత సేవలు

ఆరు నెలల తర్వాత ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వరంగల్​ అర్బన్​ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఆర్జిత సేవలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. తమకు ఆదాయం సమకూరుతోందని ఆలయ నిర్వాహకులు, పరిసరాల్లోని చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ARJITHA SERVICES STARTED IN WARANGAL DISTRICT TEMPLES
దేవాలయాల్లో భక్తుల సందడి... మొదలైన ఆర్జిత సేవలు

By

Published : Oct 6, 2020, 2:39 PM IST

లాక్​డౌన్ కారణంగా ఆరు నెలలుగా బోసిపోయిన ఆలయాలు రెండు రోజుల నుంచి కిటకిటలాడుతున్నాయి. ​లాక్​డౌన్​​ నిబంధనలు సడలించడం వల్ల భక్తుల సందడి మొదలైంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని అన్ని దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పాలకుర్తి సోమేశ్వర ఆలయం, చిల్పూర్​లోని బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయం, లింగాల ఘనపూర్​లోని జీడికల్ రామాలయం తదితర ప్రధాన దేవాలయాల్లో అర్చకులు ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఆనందంలో...

ఆరు నెలల తర్వాత దేవాలయాల్లోకి అనుమతించడం వల్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జిత సేవలతో ఆదాయం సమకూరుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో చిరువ్యాపారులు తమకు ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details