ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఓ రైతు విన్నూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హసన్ పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందిన రైతు సముద్రాల మధు తన పొలంలో కేటీఆర్ అభిమానంపై ఆంగ్ల అక్షర ఆకృతిలో వరి నారుతో విన్నూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వరినారుతో కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
మంత్రి కేటీఆర్‌కు ఓ అభిమాని వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన రైతు మధు.. కేటీఆర్ పేరును ఆంగ్ల అక్షరాలతో వరినారుతో పొలంలో ప్రదర్శించాడు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
వరినారుతో కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని.. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని రైతు సముద్రాల మధు తెలిపారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు