తెలంగాణ

telangana

ETV Bharat / state

50 ఏళ్లుగా సైకిలే వెహికిల్.. 91 ఏళ్ల వయసులోనూ ఫుల్ జోష్..

పెట్రోల్​, డీజిల్​ రేట్లు రోజురోజుకు కొండెక్కుతున్ననేపథ్యంలో.. "మళ్లీ పాత రోజులు వస్తాయేమో..? బైకులు, కార్లన్ని మూలకు పడేసి సైకిళ్లు వాడాల్సి వస్తుందేమో..?" అంటూ సరదాగా కామెంట్లు చేసుకుంటుంటాం. కానీ.. 91 ఏళ్ల ఓ తాత ఇప్పుడు కాదు అప్పుడు కాదు.. ఏకంగా 50 ఏళ్లుగా సైకిల్​ను మాత్రమే తన వాహనంగా వాడుతున్నాడంటే నమ్ముతారా..? నిజమండీ బాబు.. ఆ తాత సంగతేంటో మీరూ చూద్దూరు గానీ.. రండి!

91 year old man Surprising with his cycling since 50 years
91 year old man Surprising with his cycling since 50 years

By

Published : May 28, 2022, 5:15 PM IST

ఆశ్చర్యపరుస్తోన్న 91 ఏళ్ల వృద్ధుడు.. 50 ఏళ్లుగా సైకిల్​పైనే ప్రయాణం..

మార్కెట్​కు వెళ్లాలన్నా.. వీధి చివరున్న దుకాణానికి వెళ్లాలన్నా.. బయటికి వెళ్లే పని ఏదైనా సరే.. కనీసం బైకైనా ఉండాల్సిందే..! పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు కూడా బండి లేనిదే బయటికి వెళ్లేందుకు సరేమిరా అనే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో.. సైకిల్​ అనే మాటను దాదాపుగా మార్చిపోతున్న దుస్థతి. రానురానూ సైకిల్​ను.. వాహనంగా కాకుండా కేవలం ఓ స్పోర్ట్స్ పరికరంగానో.. వ్యాయామ సాధనంగానో.. పరిగణించే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి కాలంలోనూ.. ఓ వృద్ధుడు 91 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సైకిల్​ మీదే తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.​

మరోవైపు.. 50 ఏళ్ల వయసొచ్చిందంటే చాలు.. ప్రస్తుత రోజుల్లో ఎక్కడలేని అనారోగ్య సమస్యలన్ని శరీరంలో తిష్టేసుకుని కూర్చుంటున్నాయి. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో నాలుగు అడుగులు వేస్తేనే.. అమ్మో అయ్యో అంటూ ఆయాసపడుతుంటారు. అయితే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బోల్లోనిపల్లికి చెందిన జక్కరాజు గోవిందరావు అనే 91 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పుష్ఠిగా ఉన్నాడు. అంతేనా.. ఇప్పటికీ సైకిల్​నే తన వాహనంగా ఉపయోగిస్తున్నాడు. సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన జీవనశైలితో అందరినీ ఆశ్చరపర్చటమే కాకుండా.. ఆదర్శంగానూ నిలుస్తున్నాడు.

  • ఇదీ చూడండి: ఎన్టీఆర్​-బాలు మధ్య 'ఇనుప లవ్'- ఆ పాటలతో ఊగిపోయిన థియేటర్లు​

1976లో సమీపంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామసర్పంచ్​గా ఎన్నికైన గోవిందరావు.. సైకిల్ ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 50 ఏళ్లుగా గోవిందరావు సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల గ్రామాలకు, వ్యవసాయ పనులకు సైకిల్​పైనే వెళ్తాడు. మన గోవిందరావుకు.. పని ఏదైనా.. ఎక్కడికి వెళ్లాలన్నా.. సైకిల్​పై వెళ్లటం అలవాటు. కాసేపు సైకిల్​ తొక్కగానే అలసిపోయి ఎనర్జీడ్రింకులు తెగతాగేసే వాళ్లను చూసి.. ఈ తాతా రోజూ తొక్కుతున్నాడంటే ఏదో ప్రత్యేకమైన ఆహరం తీసుకుంటున్నాడనుకోవటం భ్రమే అవుతుంది. రోజూ సాధారణ ఆహారమే తీసుకుంటూ.. తన పని తాను చేసుకోవటమే ఆయన ఎనర్జీకి అసలు సీక్రెట్​ అంటున్నాడు.

"1976 నుంచి సైకిల్ తొక్కడం అలవాటు చేసుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు ఇంటి నుంచి బయటకు రావాలన్న, వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా.. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సైకిల్​పైనే వెళ్తుంటాను. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ తినను. రోజు సాధారణంగా తీసుకునే ఆహారమే తీసుకుంటాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నాకు సైకిల్ తొక్కడం సౌకర్యంగా అనిపిస్తుంది." - గోవిందరావు, 91 ఏళ్ల వృద్ధుడు

"మా చిన్నతనం నుంచి గోవిందరావు సైకిల్ తొక్కడం చూస్తున్నాం. మేము బండ్ల మీద వెళ్తుంటే.. ఆయన ఇప్పటికీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారు" అని గోవిందరావు గురించి గ్రామస్థులు గొప్పగా చెప్తున్నారు. సరదాకో.. వ్యాయమం అవుతుందనో.. క్రీడగానో ఎంచుకుని సైకిల్​ తొక్కుతూ.. సెల్ఫీలు తీసుకుని సోషల్​ మీడియాల్లో ఫొటోలు పెడుతున్న ఈరోజుల్లో.. రోజూ సైకిల్​ తొక్కుతూ నిత్యకృత్యాలకు వాహనంగా ఉపయోగిస్తున్న ఈ 91 ఏళ్ల తాత.. నేటి తరానికి నిజంగా ఆదర్శమే..!

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details