వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనికి తోడు జిల్లాలో వడగాల్పుల తీవ్రత పెరిగింది. దీనివల్ల ప్రజలు బయట అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. జిల్లాలో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఓరుగల్లులో భానుడి భగభగలు
లాక్డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ.. భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బయట వేడిగాలులకు తాళలేక ఇళ్లకే ఎక్కువ మంది పరిమితం అవుతున్నారు. రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఓరుగల్లులో భానుడి భగభగలు
ఇన్ని రోజులు లాక్డౌన్ వల్ల బయటకు రాలేని ప్రజలు...ఇప్పుడు తీవ్రమైన ఎండల వల్ల బయటకు రాలేకపోతున్నారు. బయటకు వస్తే ఎండ వేడిమిని తట్టుకోలేక నిమ్మకాయ రసం, కొబ్బరి బొండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.