రెండో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి పోలింగ్‌కు సంబంధించి సామగ్రిని అధికారులు సిబ్బందికి అందచేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో దశలో 26 మండలాల్లో ప్రాదేశిక పోరు జరగుతోంది. మొత్తం 240 ఎంపీటీసీ, 26 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా... 969 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 15 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఈ విడతలో మొత్తం 9 లక్షల 69 వేల 608 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
రెండో విడత కోసం ఉమ్మడి వరంగల్ సిద్ధం - local body
రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి వరంగల్ సిద్ధమైంది. పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రెండో విడత కోసం ఉమ్మడి వరంగల్ సిద్ధం