వరంగల్ గ్రామీణ జిల్లాలో పదో తరగతి మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లోని విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పదో తరగతి మొదటిరోజు పరీక్ష పూర్తి - పదో తరగతి
వరంగల్ గ్రామీణ జిల్లాలో పదోతరగతి మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణం మధ్య ముగిసింది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం హ్యాండ్‌వాష్, మాస్కులను పరీక్షా కేంద్ర నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
పదో తరగతి మొదటిరోజు పరీక్ష పూర్తి
కరోన దృష్ట్యా పరీక్షాకేంద్ర నిర్వాహకులు కొన్ని చోట్ల పిల్లలకు మాస్కులు అందజేశారు. హ్యాండ్‌వాష్ అనంతరం విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించారు. మొత్తానికి మొదటిరోజు పరీక్షకు విద్యార్థులు భయం.. భయంగానే వచ్చి పరీక్ష రాశారు.