ఉమ్మడి వరంగల్జిల్లాలో వరుస ఎన్నికల్లో ఓటమన్నదే ఎరుగని నేతగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేసీఆర్ సర్కారులో తొలిసారి మంత్రిపదవి వరించింది.
మంత్రిగా ఎర్రబెల్లి ప్రమాణ స్వీకారం
By
Published : Feb 19, 2019, 12:13 PM IST
మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. తెదేపా ఆవిర్భావంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1994 నుంచి 2018 వరకు వర్థన్నపేట, పాలకుర్తి నుంచి ఆరుసార్లు శాసనసభ్యునిగా గెలిచారు. 1999లో శాసనసభ ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2008 ఉపఎన్నికలో వరంగల్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014 తర్వాత తెదేపా శాసనసభపక్ష నేతగా పనిచేసి... తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు.