వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తి శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న చంటి అనే వ్యక్తి ఆమెను కిరాతకంగా హతమార్చాడు.
వివాహేతర సంబంధం.. కడతేర్చిన ప్రియుడు - ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం
వివాహేతర సంబంధం ఓ మహిళను దారుణ హత్యకు గురిచేసింది. మహిళతో సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెను కిరాతకంగా చంపిన ఘటన పెంబర్తిలో చోటు చేసుకుంది.
మహిళ దారుణ హత్య... వివాహేతర సంబంధమే కారణం
మాట్లాడాలని మహిళను మొక్కజొన్న తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. ఆమెను కొట్టి చంపాడు. అనంతరం నిందితుడు హాసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:డీమార్ట్‌లో ఇంటర్ విద్యార్థి మృతి.. సిబ్బందిపై తల్లిదండ్రుల ఫిర్యాదు...