విస్తృతంగా రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం - elections
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకోసం అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో తెరాస కార్యకర్తలు తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రాదేశిక ఎన్నికల ప్రచారం
రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలు తామే దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రచారాలతో గ్రామాల్లో సందడి వాతవరణం నెలకొంది. తెరాస జడ్పీటీసీ అభ్యర్థి రంగు కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.