మద్యంలో నీళ్లు కలిపి అమ్మకాలు జరుపుతున్న ఓ దుకాణదారుని ఆట కట్టించారు అబ్కారీ శాఖ అధికారులు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలోని శివమహేశ్వర వైన్స్లో మద్యం సీసాలలో నీళ్లు కలిపి అమ్ముతున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. 19 ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా కూడా మమ్మల్ని మోసం చేస్తారా అంటూ మందుబాబులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మద్యంలో మంచినీళ్లు కలిపి అమ్మకం - wine
మందులో నీళ్లు కలుపుకోవడం కామన్. కానీ బాటిళ్లలోనే నీళ్లు కలిపితే? వరంగల్ గ్రామీణ జిల్లాలోని ఓ మద్యం దుకాణంలో మందుబాటిళ్లలో నీళ్లు కలిపి అమ్ముతున్నారు. .
మద్యంలో మంచినీళ్లు