వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఆరోవిడత హరితహారం కార్యక్రమానికి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మొక్కను నాటగా, ఎంపీ నీళ్లు పోశారు. హరితహారం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల వచ్చే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఎంపీ పేర్కొన్నారు. నియోజకవర్గం హరితహారంలో జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
'ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటాలి.. ప్రతిమొక్కనూ సంరక్షించాలి' - ఎంపీ పసునూరి దయాకర్
ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటాలని.. ప్రతిమొక్కనూ సంరక్షించాలని ఎంపీ దయాకర్ సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
చెట్లు పెంచండి... పర్యావరణాన్ని కాపాడండి
సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కనీసం 3 నుండి 5 మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం