వరంగల్ గ్రామీణ జిల్లాలో తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు నడుం బిగించారు. మూలమలుపులు, రోడ్లపై గుంతలు, గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పర్వతగిరి మండలం తీగరాజుపల్లి ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి ఈ మధ్యే చనిపోయిన ముగ్గురి ఫొటోలతో ఫ్లెక్లిలు పెట్టారు.
ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు.. ఆదర్శంగా నిలుస్తున్న పోలీసులు - Warangal Rural District Latest News
పోలీసులంటే లాఠీలకు పనిచెప్పడం కాదు.. ప్రజల భద్రతే ముఖ్యం అంటున్నారు. పోలీసులంటే ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘనలకు చలానలు విధించడమే కాదు.. వాహనదారుల సురక్షిత ప్రయాణమే ధ్యేయం అంటున్నారు వరంగల్ గ్రామీణ జిల్లా రక్షకభటులు. జిల్లాలో తరచు జరుగుతున్న ప్రమాదాలు నివారించేందుకు నడుం బిగించి హెచ్చరిక బోర్డులు నాటుతున్నారు. వాహన దారులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలపై వరంగల్ గ్రామీణ జిల్లా పోలీసుల అవగాహన
పర్వతగిరి, సంగెం మండలాల పరిధిలోని గ్రామాలు, ప్రధాన రోడ్డు మర్గాల్లో గుంతలను కాంక్రిట్‌తో పూడ్చి వాహన దారులకు అవగాహన కల్పించారు. సరైన ధ్రువపత్రాలు, హెల్మెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదకర రీతిలో వాహనం నడిపినా.. హెల్మెట్ ధరించకపోయినా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:అక్రమంగా అబార్షన్లు చేస్తున్న ముఠా అరెస్టు