ఈ నెల 19 నుంచి జరుగబోయే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ గ్రామీణ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి హన్మకొండలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 7,661 రెగ్యులర్, 33 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హజరవనున్నట్లు పేర్కొన్నారు. 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
'పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి' - warangal rural deo vasanthi said about tenth class exams arrangements in hanmakonda
పదో తరగతి వార్షిక పరీక్షలకు వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. మొత్తం 7 వేల 661 మంది రెగ్యులర్, 33 మంది ప్రైవేటు విద్యార్థులకు 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
'పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని.. పరీక్ష ప్రారంభమైన ఐదు నిముషాల వరకు అనుమతిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని హెచ్చరించారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వాసంతి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు