వరంగల్ రూరల్ జిల్లాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగెం మండలం మొండ్రాయి గ్రామపంచాయతీ కార్యదర్శి సరితను కలెక్టర్ హరిత సస్పెండ్ చేశారు. వీధి దీపాల కొనుగోలు, ఇతర అభివృద్ధి పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గ్రామస్థులు.. కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె విచారణకు ఆదేశించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ - village panchayat secretary suspension
మొండ్రాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఆమెపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.
మొండ్రాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
విచారణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో ఆగ్రహించిన పాలనాధికారి.. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:నందిహిల్స్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన యూసఫ్