వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు జరిపిన దాడుల్లో నిషేధిత అంబర్ గుట్కా బయటపడింది. మండల పరిధిలోని దివిటిపల్లి గ్రామంలో నిషేధిత అంబర్ గుట్కా అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూ.60వేల విలువ చేసే అంబర్ ప్యాకెట్లు దొరికాయి. గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు.
నిషేధిత గుట్కా పట్టుకున్న పోలీసులు - వరంగల్ జిల్లా
వరంగల్ గ్రామీణ జిల్లాలో నిషేధిత అంబర్ గుట్కా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. టాస్క్ఫోర్స్ బృందాలు, పోలీసులు చేసిన వరుస దాడులు, తనిఖీల్లో పలుమార్లు చర్యలు తీసుకున్నా.. అక్రమ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా వర్ధన్నపేట మండలంలో మరోసారి నిషేధిత అంబర్ గుట్కా అమ్మకాల తతంగం బయటపడింది.
నిషేధిత గుట్కా పట్టుకున్న పోలీసులు
చిన్న చిన్న దుకాణాల్లోనే వేల రూపాయల విలువ చేసే గుట్కా, మత్తు పదార్థాలు పట్టుబడటం వల్ల భారీ దాడులు చేస్తే.. పెద్ద మొత్తంలో గుట్కా, మత్తు పదార్థాలు దొరుకుతాయంటున్నారు గ్రామస్థులు. ప్రాణాంతక గుట్కాలు, సిగరెట్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.